తెలుగు

వినయం యొక్క గొప్పతనం

మంగళవారం, జనవరి 2, 2024

బిషప్పులు, సభ వేదపండితులైన పునీత మహా బాసిల్ మరియు పునీత గ్రెగొరీ నాజియాన్జెన్‌ల స్మరణ

నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

“నేను నీటితో బప్తిస్మమిస్తున్నాను; అయితే మీరు గుర్తించని ఒకరు మీ మధ్య ఉన్నారు. ఆయనే నా తరువాత వచ్చేవారు; ఆయన పాదరక్షల పట్టీ విప్పడానికి కూడా నాకు అర్హత లేదు.”  యోహాను 1:26–27

మన క్రిస్మస్ అష్టదినోత్సవం ముగిసినందున, మన ప్రభువు తరువాత చేపట్టబోయే పరిచర్య వైపు వెంటనే దృష్టి సారించడం ప్రారంభిస్తాము. నేటి సువార్తలో, యేసు చేపట్టబోయే ఆ పరిచర్యను మనకు చూపించేది స్నాపక యోహాను. నీటితో బాప్తిస్మమివ్వాలనే తన ధ్యేయం తాత్కాలికమైనదనీ, తన తరువాత రాబోయే వ్యక్తి కోసం చేసే సిద్ధపాటు మాత్రమేననీ ఆయన అంగీకరిస్తాడు.

మన ఆగమనకాల పఠనాలలో కొన్నింటిలో చూసినట్లుగా, స్నాపక యోహాను ఎంతో వినయంగల వ్యక్తి. యేసు పాదరక్షల పట్టీలను విప్పడానికి కూడా తాను యోగ్యుడు కాదని ఆయన అంగీకరించడమే దీనికి నిదర్శనం. అయితే ఆశ్చర్యకరంగా, ఈ వినయపూర్వకమైన అంగీకారమే ఆయనను అంత గొప్పవానిగా చేస్తుంది!

మీరు గొప్ప స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారా? మన అంతరంగంలో మనమందరం అలాగే కోరుకుంటాము. ఈ కోరిక, ఆనందంగా ఉండాలనే మన సహజమైన కోరికతో ముడిపడి ఉంటుంది. మన జీవితాలకు అర్థం, ఉద్దేశం ఉండాలని, మనం ఒక మార్పు తీసుకురావాలని కోరుకుంటాము. అయితే ప్రశ్న ఏమిటంటే, “ఎలా?” మీరు దీన్ని ఎలా చేయగలరు? నిజమైన గొప్పతనాన్ని ఎలా సాధించగలరు?

లోక దృష్టిలో గొప్పతనం అనేది తరచూ విజయం, సంపద, అధికారం, ఇతరుల మెప్పు మొదలైనవాటికి సమానార్థకంగా మారవచ్చు. కానీ దైవ దృష్టిలో, మన జీవితాల ద్వారా దేవునికి మనం ఇవ్వగలిగినంత అత్యున్నత మహిమను వినయంగా చెల్లించడం ద్వారానే గొప్పతనాన్ని సాధిస్తాము.

దేవునికే సమస్త మహిమను చెల్లించడం మన జీవితాలపై రెండు విధాలుగా ప్రభావం చూపుతుంది. మొదటిగా, అలా చేయడం వల్ల జీవిత సత్యానికి అనుగుణంగా జీవించగలుగుతాము. ఆ సత్యం ఏమిటంటే, దేవుడు, దేవుడు మాత్రమే మన స్తుతి మహిమలన్నింటికీ అర్హుడు. మేలైనవన్నీ దేవుని నుంచే, దేవుని నుంచి మాత్రమే వస్తాయి. రెండవదిగా, దేవునికే సమస్త మహిమను వినయంగా చెల్లిస్తూ, మనం ఆయనకు తగినవారము కాదనే వాస్తవాన్ని తెలియజేసినప్పుడు, ప్రతిగా దేవుడు మన స్థాయికి దిగి వచ్చి, తన జీవంలోను తన మహిమలోను పాలుపంచుకునేలా మనలను పైకెత్తుతాడు.

స్నాపక యోహాను వినయాన్ని అనుసరించాలనే మీ పిలుపు గురించి ఈ రోజు ధ్యానించండి. దేవుని గొప్పతనం, మహిమ ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోవడానికి ఎన్నడూ వెనుకాడకండి. అలా చేయడం మిమ్మల్ని కించపరచదు, మీ గొప్పతనానికి అడ్డురాదు. బదులుగా, దేవుని మహిమ ఎదుట అత్యంత లోతైన వినయంతో ఉన్నప్పుడే, ఆయన తన జీవం, ధ్యేయం యొక్క గొప్పతనంలోకి మిమ్మల్ని ఆకర్షించగలుగుతాడు.

ప్రభువా, సమస్త మహిమను, స్తుతిని నీకు, నీకు మాత్రమే అర్పిస్తున్నాను. సమస్త మేలుకూ మూలం నీవే; నీవు లేక నేను శూన్యం. నీ కృపాజీవితపు మహిమలోను ఘనతలోను పాలుపొందేలా, నీ ఎదుట నన్ను నేను ఎల్లప్పుడూ తగ్గించుకోవడానికి నాకు సహాయం చేయుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

2024 కోసం కొత్తగా!

ఆరాధనా సంవత్సరంలోని పునీతులు, పండుగలు
సంపుటాలు ఒకటి–నాలుగు

మా క్రిస్మస్ వనరులను చూడండి!

పవిత్ర గ్రంథ ధ్యానాలు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతులు – పునీత మహా బాసిల్ మరియు పునీత నాజియాన్జెన్ గ్రెగొరీ, పీఠాధిపతులు మరియు సభ పండితులు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన చూపిన ప్రధాన చిత్రం: క్రీస్తు జ్ఞానస్నానం — నికోలాస్ ఎన్రీకెజ్ చిత్రకృతి, వికీమీడియా కామన్స్ ద్వారా


దైవకారుణ్యంతో 365 రోజుల ప్రయాణంలో మాతో చేరండి!

దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు: పునీత ఫౌస్తీనాతో 365 రోజులు జనవరి 1న ధ్యానం 1తో ప్రారంభమైంది.  ఈ కొత్త సంవత్సరానికి మనం సిద్ధమవుతున్న వేళ, రాబోయే సంవత్సరమంతా దేవుని అపారమైన కారుణ్యాన్ని ప్రతిరోజూ ధ్యానించేందుకు మాతో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.  ఈ ప్రయాణంలో మాతో చేరేందుకు మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను ఆహ్వానించమని కూడా మిమ్మల్ని కోరుతున్నాము!  ఈ విధంగా మాతో చేరమని వారిని ఆహ్వానించండి:

  1. దైవకారుణ్యంపై రోజువారీ ఇమెయిళ్ల కోసం నమోదు చేసుకోవడం ద్వారా
  2. మా దైనందిన కతోలిక ధ్యానాలు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా
  3. ప్రతిరోజూ మా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా
  4. దైవకారుణ్యంపై దైనందిన ధ్యానాలు పుస్తకాన్ని పేపర్‌బ్యాక్ లేదా ఈ-పుస్తక రూపంలో కొనుగోలు చేయడం ద్వారా

ఈ కొత్త సంవత్సరంలో దేవుని అపారమైన కారుణ్యాన్ని కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి!

ఈ-పుస్తకం & పేపర్‌బ్యాక్ రూపాల్లో లభ్యం