తెలుగు

జ్ఞానానికి తాళంచెవి

అక్టోబరు 13, 2022
సామాన్య కాలంలోని ఇరవై ఎనిమిదవ వారపు గురువారం
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

“ధర్మశాస్త్ర పండితులారా, మీకు శ్రమ! మీరు జ్ఞానపు తాళంచెవిని తీసివేశారు. మీరు లోపలికి ప్రవేశించలేదు, ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నవారినీ అడ్డుకున్నారు.”  లూకా 11:52

నేటి సువార్తలో యేసు పరిసయ్యులను, ధర్మశాస్త్ర పండితులను మందలించడం కొనసాగిస్తున్నారు. పైన పేర్కొన్న వచనంలో, వారు “జ్ఞానపు తాళంచెవిని తీసివేశారు” కాబట్టి ఆయన వారిని మందలిస్తున్నారు. దేవుడు ఇతరులకు అందించాలని కోరుకునే జ్ఞానం వారికి అందకుండా చేయడానికి వారు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారు. ఇది తీవ్రమైన ఆరోపణ. పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులు దేవుని ప్రజల విశ్వాసానికి ఉద్దేశపూర్వకంగా హాని కలిగిస్తున్నారని ఇది వెల్లడిస్తుంది.

గత కొన్ని రోజులుగా పవిత్ర గ్రంథ పఠనాల్లో మనం చూసినట్లుగా, ఇందుకు యేసు ధర్మశాస్త్ర పండితులను, పరిసయ్యులను తీవ్రంగా గద్దించారు. ఆయన గద్దింపు వారి కోసమే కాదు, మన కోసం కూడా. సత్యం కంటే తమ గురించి, తమ పేరు ప్రతిష్ఠల గురించే ఆసక్తి చూపే ఇలాంటి తప్పుడు ప్రవక్తలను, అటువంటి వారందరినీ మనం అనుసరించకూడదని తెలుసుకోవడానికే అది.

ఈ సువార్త భాగం ఈ పాపాన్ని ఖండించడం మాత్రమే కాదు; అంతకంటే ముఖ్యంగా, ఒక లోతైన, అందమైన భావనను మన ముందుంచుతుంది. అదే “జ్ఞానపు తాళంచెవి” అనే భావన. జ్ఞానపు తాళంచెవి ఏమిటి? జ్ఞానపు తాళంచెవి విశ్వాసం. దేవుని స్వరాన్ని వినడం ద్వారానే విశ్వాసం కలుగుతుంది. దేవుడు మీతో మాట్లాడటానికి, తన అత్యంత లోతైన, సుందరమైన సత్యాలను మీకు వెల్లడించడానికి మీరు అనుమతించడమే జ్ఞానానికి తాళంచెవి. ప్రార్థన ద్వారా, దేవునితో నేరుగా సంభాషించడం ద్వారా మాత్రమే ఈ సత్యాలను స్వీకరించి విశ్వసించగలం.  

దేవుని జీవంలోని లోతైన రహస్యాలను గ్రహించినవారికి పునీతులే ఉత్తమ ఉదాహరణలు. తమ ప్రార్థనా జీవితం, విశ్వాసం ద్వారా వారు దేవుణ్ణి ఎంతో లోతుగా తెలుసుకున్నారు. ఈ గొప్ప పునీతులలో అనేకమంది, దేవుని అంతరంగ జీవంలోని గుప్తమైనా వెల్లడించబడిన రహస్యాల గురించి అందమైన రచనలను, శక్తివంతమైన సాక్ష్యాన్ని మనకు అందించారు.

మీరు “జ్ఞానపు తాళంచెవి”ని తీసుకొని, మీ విశ్వాస జీవితం, ప్రార్థన ద్వారా దేవుని రహస్యాలను తెరిచారా లేదా అన్నది ఈ రోజు ధ్యానించండి. మీ దైనందిన వ్యక్తిగత ప్రార్థనలో దేవుణ్ణి అన్వేషించడానికి, ఆయన మీకు వెల్లడించాలని కోరుకునే వాటన్నిటినీ వెదకడానికి మిమ్మల్ని మీరు మళ్లీ అంకితం చేసుకోండి.

ప్రభువా, దైనందిన ప్రార్థనా జీవితం ద్వారా నిన్ను అన్వేషించడానికి నాకు సహాయం చేయి.  ఆ ప్రార్థనా జీవితంలో, నీవెవరో, జీవితమంటే ఏమిటో నాకు సంపూర్ణంగా వెల్లడిస్తూ, నీతో గాఢమైన అనుబంధంలోకి నన్ను నడిపించు.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

కొత్తది!


దేవుని వైపు అంతరంగ ప్రయాణం:
అవిలా పునీత తెరేసా ధ్యానాలు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

ప్రత్యేక చిత్రం: జేమ్స్ టిస్సో చిత్రించిన యెరూషలేమా యెరూషలేమా, బ్రూక్లిన్ మ్యూజియం ద్వారా