తెలుగు

మీరు ధన్యులా?

అక్టోబరు 8, 2022
సామాన్య కాలపు ఇరవై ఏడవ వారంలోని శనివారం
నేటి పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

యేసు మాట్లాడుతుండగా, జనసమూహంలోని ఒక స్త్రీ బిగ్గరగా ఆయనతో, “నిన్ను మోసిన గర్భమూ, నీవు పాలు త్రాగిన స్తనములూ ధన్యమైనవి” అని అంది. అందుకు ఆయన, “అంతకంటే, దేవుని వాక్యాన్ని విని ఆచరించేవారు ధన్యులు” అని సమాధానమిచ్చారు.  లూకా 11:27-28

మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారా?  వింటుంటే, దానిని ఆచరిస్తున్నారా?  అలా అయితే, మన ప్రభువు చేత నిజంగా ధన్యులైన వారిలో మీరు కూడా ఉన్నారని భావించవచ్చు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ వాక్యభాగంలో యేసుతో మాట్లాడుతున్న స్త్రీ, ఆయనను గర్భంలో మోసి, పాలిచ్చినందుకు ఆయన తల్లి ధన్యురాలని చెబుతూ ఆమెను గౌరవించింది.  అయితే యేసు తాను పలికిన మాటల ద్వారా తన తల్లిని ఇంకా గొప్పగా గౌరవిస్తున్నారు.  ఆమె అందరికంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని విని, దానిని పరిపూర్ణంగా ఆచరిస్తుంది కాబట్టి ఆయన ఆమెను గౌరవించి, ధన్యురాలని పిలుస్తున్నారు.

వినడం, ఆచరించడం అనేవి రెండు ఎంతో భిన్నమైన విషయాలు.  ఆధ్యాత్మిక జీవితంలో ఈ రెండింటికీ ఎంతో నిబద్ధత అవసరం.  అన్నింటికంటే ముందుగా, దేవుని వాక్యాన్ని వినడం అంటే కేవలం చెవులతో వినడమో, బైబిలును చదవడమో కాదు.  ఇక్కడ “వినడం” అంటే దేవుడు మన ఆత్మలతో సంభాషించాడని అర్థం.  అంటే మనం ఒక వ్యక్తితో, స్వయంగా యేసుతోనే, సంబంధంలోకి ప్రవేశిస్తున్నామనీ, ఆయన మనకు తెలియజేయాలని కోరుకునేదంతా తెలియజేయడానికి ఆయనను అనుమతిస్తున్నామనీ అర్థం.

యేసు మాట్లాడుతుంటే వినడం, ఆయన చెప్పేదాన్ని హృదయంలో ఇముడ్చుకోవడం కష్టంగా ఉండవచ్చు. అయితే, ఆయన పలికిన దానిని మనం జీవించేంతగా ఆయన వాక్యం మనల్ని మార్చనివ్వడం మరింత కష్టమైనది.  చాలా తరచుగా మనకు ఎంతో మంచి ఉద్దేశాలు ఉన్నప్పటికీ, దేవుని వాక్యం ప్రకారం జీవిస్తూ వాటిని కార్యరూపంలో పెట్టడంలో విఫలమవుతుంటాం.

ఈ రోజు, వినడం, ఆచరించడం అనే ఈ రెండింటి గురించీ ధ్యానించండి.  వినడంతో ప్రారంభించండి. ప్రతిరోజూ యేసు మీతో సంబంధంలోకి రావడానికి మీరు అవకాశం ఇస్తున్నారా లేదా అని ఆలోచించండి.  ఆ తరువాత, ఆయన పలికారని మీకు తెలిసిన దానిని మీరు జీవిస్తున్నారా అని ఆలోచించండి.  ఈ ప్రక్రియకు మిమ్మల్ని మీరు మళ్లీ అంకితం చేసుకోండి. అప్పుడు మీరు కూడా నిజంగా ధన్యులేనని గ్రహిస్తారు!

దేవుని నిత్య వాక్యమా, నీవు నాతో మాట్లాడుతుండగా నేను వినగలుగుదును గాక.  నా ఆత్మలో నిన్ను కలుసుకొని నీ పవిత్ర వాక్యాన్ని స్వీకరించగలుగుదును గాక.  నీవు నాకోసం సిద్ధపరచి ఉంచిన ఆశీర్వాదాలను అనుభవించేలా, ఆ వాక్యాన్ని నా జీవితంలో ఆచరణలో పెట్టగలుగుదును గాక.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

కొత్తది!


దేవుని వైపు అంతరంగ ప్రయాణం:
అవిలా పునీత తెరేసా ధ్యానాలు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

ప్రత్యేక చిత్రం: జనసమూహంలో బిగ్గరగా పిలుస్తున్న ఒక స్త్రీ — జేమ్స్ టిస్సో, వికీమీడియా కామన్స్ ద్వారా