తెలుగు

ఆత్మ శత్రువులపై దాడి చేయడం

డిసెంబర్ 14, 2023

యాజకుడు, సభ పండితుడు అయిన పునీత సిలువ యోహాను స్మరణ

నేటి పఠనాలు
ఆగమనకాలం రెండవ వారంలోని గురువారం పఠనాలు

వీడియో

ఆంగ్లంలో వినండి

“బాప్తిస్మ యోహాను దినాల నుండి ఇప్పటివరకు పరలోక రాజ్యం హింసకు గురవుతోంది; హింసకు పాల్పడేవారు దానిని బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారు.”  మత్తయి 11:12

“హింసకు పాల్పడుతూ” పరలోక రాజ్యాన్ని “బలవంతంగా” స్వాధీనం చేసుకుంటున్న వారిలో మీరు ఉన్నారా? మీరు వారిలో ఉన్నారనే ఆశిస్తున్నాము!

కొన్నిసార్లు యేసు మాటలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. పై వాక్యం అలాంటి ఒక సందర్భాన్ని మన ముందుంచుతుంది. ఈ వాక్యం గురించి పునీత హోసేమరియా ఎస్క్రివా ఇలా పేర్కొంటారు: ఇక్కడ “హింసకు పాల్పడేవారు” అంటే, తాము ఉన్న పరిసరాలు విశ్వాసానికి ప్రతికూలంగా ఉన్నప్పుడు “మనోధైర్యం,” “తెగువ” చూపే క్రైస్తవులు (చూడండి: క్రీస్తు మన దారిన వెళ్తున్నారు, 82). పరలోక రాజ్యం “తమతో తాము పోరాడేవారికి” చెందుతుందని అలెగ్జాండ్రియాకు చెందిన పునీత క్లెమెంట్ చెబుతారు (రక్షణ పొందే ధనవంతుడు ఎవరు, 21). మరో మాటలో చెప్పాలంటే, పరలోక రాజ్యాన్ని స్వాధీనం చేసుకునే “హింసకు పాల్పడేవారు” అంటే, ఆ రాజ్యాన్ని పొందడానికి తమ ఆత్మ శత్రువులతో తీవ్రంగా పోరాడేవారు.

ఆత్మ శత్రువులు ఏమిటి? సంప్రదాయంగా మనం లోకం, శరీరం, అపవాది గురించి మాట్లాడుతాము. దేవుని రాజ్యంలో జీవించడానికి కృషి చేస్తున్న క్రైస్తవుల ఆత్మలలో ఈ ముగ్గురు శత్రువులు ఎంతో హింసను రేకెత్తించారు. మరి మనం ఆ రాజ్యం కోసం ఎలా పోరాడాలి? బలప్రయోగంతో! కొన్ని అనువాదాలు “దాడి చేసేవారు” ఆ రాజ్యాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని చెబుతాయి. అంటే, క్రైస్తవ జీవితం పూర్తిగా నిష్క్రియాత్మకంగా ఉండకూడదు. కేవలం చిరునవ్వులు చిందిస్తూ మనం పరలోకంలోకి ప్రవేశించలేము. మన ఆత్మ శత్రువులు నిజంగా ఉన్నారు; వారు దూకుడుగా దాడి చేస్తారు. అందువల్ల, క్రీస్తు మనోధైర్యంతో, తెగువతో ఈ శత్రువులను నేరుగా ఎదుర్కొనే విధంగా మనం కూడా దూకుడుగా వ్యవహరించాలి.

మనం దీన్ని ఎలా చేయాలి? ఉపవాసం, ఆత్మనిగ్రహం ద్వారా శరీరమనే శత్రువును ఎదుర్కొంటాము. ఈ యుగపు “జ్ఞానానికి” అనుగుణంగా నడుచుకోవడానికి నిరాకరిస్తూ, క్రీస్తు సత్యంలో, సువార్త సత్యంలో స్థిరంగా నిలవడం ద్వారా లోకాన్ని ఎదుర్కొంటాము. మనలను మోసగించడానికి, అయోమయంలో పడవేయడానికి, అన్ని విషయాలలో తప్పుదారి పట్టించడానికి అపవాది పన్నే దుష్ట పన్నాగాలను గుర్తించడం ద్వారా అతనిని ఎదుర్కొంటాము. అలా అతనిని గద్దించి, మన జీవితంలో అతని పనులను తిరస్కరిస్తాము.

మీ అంతరంగంలో దాడి చేసే ఆ శత్రువులతో పోరాడటానికి మనోధైర్యంలోను, తెగువలోను ఎదగాలన్న మీ పిలుపు గురించి ఈ రోజు ధ్యానించండి. ఈ పోరాటంలో భయం నిరుపయోగం. మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తి, కారుణ్యాలపై నమ్మకమే మనకు అవసరమైన ఏకైక ఆయుధం. ఆయనపై ఆధారపడండి. క్రీస్తు శాంతిని మీ నుండి దోచుకోవడానికి ఈ శత్రువులు చేసే అనేక ప్రయత్నాలకు లొంగిపోకండి.

మహిమాన్వితుడవైన, విజయశాలివైన నా ప్రభువా, లోకాన్ని, నా శరీర ప్రలోభాలను, సాతానునే సైతం దృఢంగా ఎదిరించి నిలబడగలిగేలా నీవు నీ కృపను కుమ్మరిస్తావని నీపై నమ్మకం ఉంచుతున్నాను. విశ్వాసపు మంచి పోరాటాన్ని పోరాడుతూ, నిన్నూ, నా జీవితానికి సంబంధించిన నీ పరమపవిత్ర చిత్తాన్నీ వెదకడంలో ఎన్నడూ తడబడకుండా ఉండేందుకు నాకు ధైర్యాన్ని, నిర్భీతిని, మనోస్థైర్యాన్ని దయచేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

దైవైక్యానికి మార్మిక యాత్ర:
సిలువ పునీత యోహాను అందించే ఆధ్యాత్మిక జ్ఞానం

2024 కోసం కొత్తగా!
ఒక గొప్ప క్రిస్మస్ కానుక…

ఆరాధనా సంవత్సరంలోని పునీతులు మరియు పండుగలు
ఒకటి–నాలుగు సంపుటాలు

పునీత అంద్రేయ క్రిస్మస్ నవదిన ప్రార్థన
సంప్రదాయంగా నవంబర్ 30 నుండి క్రిస్మస్ ముందురోజు వరకు రోజుకు 15 సార్లు ప్రార్థిస్తారు.

మా ఆగమనకాల వనరులను చూడండి!

పవిత్ర గ్రంథ ధ్యానాలు

మరిన్ని సువార్త ధ్యానాలు

దైవకారుణ్య ధ్యానాలు

పునీతులందరూ/పండుగలు

నేటి పునీతుడు – పునీత సిలువ యోహాను, గురువు మరియు సభ పండితుడు

దివ్యబలిపూజ పఠనాల ఎంపికలు

పైన ప్రదర్శించిన చిత్రం: పరమానంద దర్శనం, ఫ్లికర్ ద్వారా