శనివారం, అక్టోబరు 7, 2017
ఈ రోజు మనం జపమాల మాతను సత్కరిస్తున్న సందర్భంగా, ఈ శక్తిమంతమైన ప్రార్థన గురించి ధ్యానించడానికి ఇది ఒక మంచి అవకాశం. జపమాల శక్తిని గురించి ధ్యానించడానికి ఉత్తమ మార్గం పునీతుల బోధనలను ఆశ్రయించడమే. జపమాల గురించి దేవుని పునీతులు చెప్పిన అనేక సూక్తులను క్రింద మీరు చదవవచ్చు. వాటిని ధ్యానించి, అవి మీ హృదయంతో మాట్లాడనివ్వండి.
“ప్రతిరోజూ జపమాల జపించేవారెవరూ ఎన్నటికీ దారితప్పరు. ఈ ప్రకటనపై నా రక్తంతో సంతకం చేయడానికి నేను సంతోషంగా సిద్ధపడతాను.” – పునీత లూయీ దె మోంత్‌ఫోర్ట్.
“ప్రార్థనలన్నిటిలో జపమాల అత్యంత సుందరమైనది, కృపలతో అత్యంత సమృద్ధమైనది… జపమాలను ప్రేమించండి, ప్రతిరోజూ భక్తితో జపించండి.” – పునీత పయస్ X.
“ప్రతి సాయంత్రం జపమాల జపించే కుటుంబం ఎంత సుందరమైనది!” – పునీత పోప్ జాన్ పాల్ II.
“జపమాల నాకు అత్యంత ఇష్టమైన ప్రార్థన. ఒక అద్భుతమైన ప్రార్థన! దాని సరళతలోనూ, దాని లోతులోనూ అద్భుతమైనది.” – పునీత పోప్ జాన్ పాల్ II.
“జపమాల దేవుని ప్రేరణతో లభించిన అమూల్యమైన నిధి.” – పునీత లూయీ దె మోంత్‌ఫోర్ట్.
“కుటుంబంపై దేవుని ఆశీర్వాదాలను కురిపించమని వేడుకోవడానికి… ప్రతిరోజూ జపమాల జపించడం కంటే నమ్మదగిన మార్గం మరొకటి లేదు.” – పోప్ పయస్ XII.
“జపమాల అత్యుత్తమమైన ప్రార్థనా రూపం, నిత్యజీవాన్ని పొందడానికి అత్యంత ఫలప్రదమైన సాధనం. అది మన చెడులన్నిటికీ పరిహారం, మన ఆశీర్వాదాలన్నిటికీ మూలం. ప్రార్థించడానికి ఇంతకంటే శ్రేష్ఠమైన మార్గం లేదు.” – పునీత పోప్ లియో XIII.
“జపమాల జపించే ఒక సైన్యాన్ని నాకు ఇవ్వండి, నేను ప్రపంచాన్ని జయిస్తాను.” – ధన్య పోప్ పయస్ IX.
“మీ హృదయాల్లో, మీ ఇళ్లలో, మీ దేశంలో శాంతిని కోరుకుంటే, ప్రతి సాయంత్రం జపమాల జపించడానికి కూడిరండి. ఎన్నో చింతలు, పనులతో మీరు ఎంతగా సతమతమవుతున్నా, జపమాల జపించకుండా ఒక్క రోజు కూడా గడవనివ్వకండి.” – పోప్ పయస్ XI.
“జపమాల జపించడం ద్వారా నేను కోరిన కృపను మన మాత నాకు ఎన్నడూ నిరాకరించలేదు.” – పియెట్రెల్చీనాకు చెందిన పునీత పాద్రే పియో.
“ప్రార్థన చేయడానికి అత్యుత్తమ పద్ధతి జపమాల జపించడమే.” – పునీత ఫ్రాన్సిస్ దె సేల్స్.
“ఒకరోజు, జపమాల ద్వారా, స్కపులర్ ద్వారా మన మాత లోకాన్ని రక్షిస్తుంది.” – పునీత దొమినిక్.
ప్రభువా, ఈ అమూల్యమైన వరమైన పవిత్ర జపమాల శక్తిని నేను అర్థం చేసుకునేలా చేయుము. దీనిని నా దైనందిన ప్రార్థనలో భాగం చేసుకునే కృపను నాకు దయచేయుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.




